జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ గురించి అలా స్పందించిన తమిళ స్టార్ దర్శకుడు..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోయిన సంవత్సరం విడుదల అయిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ... కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను పెట్టకపోవడంతో ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది.

  అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ హీరోయిన్ గా కనిపించనుండగా ... రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లో ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ ... అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందబోయే వార్ 2 మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత నీల్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఎన్టీఆర్ తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వేట్రి మారన్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు అని అనేక వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ తో సినిమా గురించి కొన్ని వేట్రి మారన్ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు ... తాను ఎన్టీఆర్‌ని కలిశానని ... అలాగే ఎన్టీఆర్ తో ప్రాజెక్టు కచ్చితంగా జరుగుతుందని ... అయితే సమయం పడుతుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: