మహేష్ తో మూవీ గురించి అలా స్పందించిన తమిళ స్టార్ డైరెక్టర్..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి వెట్రి మారన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన అనేక సినిమాలు తమల బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలు సాధించడంతో  ప్రస్తుతం ఈ దర్శకుడు తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు విదుతలై పార్ట్ 1 అనే తమిళ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కమెడియన్ సూరి హీరోగా నటించగా ... విజయ్ సేతుపతి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కొంత కాలం క్రితమే తమిళ భాషలో విడుదల అయింది. ఇప్పటికే ఈ సినిమా తమిళ ప్రేక్షకులను ఎంత గానో అలరించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని తెలుగు లో "విడుదల" పేరుతో ఏప్రిల్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఈ మూవీ ని తెలుగు లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల సందర్భంగా తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఈ మూవీ ప్రీమియర్స్ సందర్భంగా తెలుగు మీడియాతో ముచ్చటించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరైన వెట్రిమారన్ పలువురు మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.  సూపర్ స్టార్ మహేష్ బాబు ని కూడా ఆడుకాలం మూవీ రిలీజ్ అనంతరం కలిశానని ... అయితే ఆయనతో సినిమాకి సంబంధించి కథ ఏది కుదరలేదని తాజాగా అన్నారు. కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో మహేష్ టి మంచి సినిమా చేస్తానని వేట్రి మారన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: