పవన్ నటిస్తున్న 4 మూవీలు విడుదల అయ్యేది అప్పుడే..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 2 సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. అలాగే కొన్ని రోజుల క్రితం ఒక మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. అలాగే మరికొన్ని రోజుల్లో మరో మూవీ షూటింగ్ ను ప్రారంభించబోతున్నాడు. పవన్  ప్రస్తుతం నటిస్తున్న 2 సినిమాలు అలాగే షూటింగ్ పూర్తి చేసుకున్న మరో మూవీ ... త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న మరో మూవీ  మొత్తం నాలుగు మూవీలను ఈ మూవీ మేకర్ లు ఎప్పుడూ విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాం.
పవన్ ఇప్పటికే తమిళ సినిమా వినోదయ సీతం కు రీమేక్ గా రూపొందిన సినిమా యొక్క షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాను ఇప్పటికే జులై 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. సముద్ర కని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ ఒక కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. పవన్ ... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల చేసే ఆలోచనలు ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.

నిది అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి ... ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. పవన్ మరికొన్ని రోజుల్లో యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే "ఓ జి" అనే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ ను ప్రారంభించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: