ఆ మూవీలో బన్నీ గెస్ట్ రోల్... షూటింగ్ కూడా కంప్లీట్..?

Pulgam Srinivas
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ది రూల్ అనే భారీ బడ్జెట్.పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో పహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర బృందం ఒక స్పెషల్ వీడియోను విడుదల చేయగా ఆ వీడియోకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ... షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి జవాన్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ... బన్నీ పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా ఉండనున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ వార్తకు సంబంధించి ఒక అదిరిపోయే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  

నిజం గానే జవాన్ మూవీ లో అల్లు అర్జున్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ... నటించబోవడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఆ సినిమాలో బన్నీ కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు ... అలాగే మరి కొన్ని రోజుల్లో జవాన్ మూవీ యూనిట్ విడుదల చేయబోయే టీజర్ లో బన్నీ కూడా కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: