సమంత వల్ల.. అక్కినేని కుటుంబం ముక్కలవుతుందా?

praveen
ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైన సమంత.. ఇక ఆ తర్వాత ఆ సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడిపోయింది. ఎన్నో ఏళ్లపాటు ప్రేమలో మునిగితేలీన సమంత చివరికి పెళ్లి అనే బంధంతో తమ ప్రేమకు ప్రమోషన్ ఇచ్చేసింది. ఇక అక్కినేని కోడలుగా మారిన తర్వాత గ్లామర్ పాత్రలకు గుడ్ బై చెప్పేసీ కేవలం లేడీ ఓరియంటెడ్ పాత్రలు మాత్రమే చేసింది. అంతేకాదు ఇక తెలుగు ఇండస్ట్రీలో నాగచైతన్య సమంత జోడి అందరికీ ఫేవరెట్ జోడిగా మారిపోయింది అని చెప్పాలి.

 వీరిద్దరూ ఎక్కడ కనిపించినా ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమను చూపించుకునేవారు. కానీ అలాంటి వీరిద్దరి జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యాం అంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక విడాకుల తర్వాత నాగచైతన్య సమంత బద్ధ శత్రువులేమో అనేట్లుగా కఠినంగానే ఉంటున్నారు. మొన్నటికి మొన్న సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు కనీసం నాగచైతన్య స్పందించలేదు. నాగచైతన్య పుట్టినరోజుకు సమంత విషెస్ చెప్పలేదు.

 కానీ ఇప్పుడు విడాకుల తర్వాత ఏకంగా అక్కినేని మాజీ కోడలు అయిన సమంత కారణంగా అక్కినేని కుటుంబం ముక్కలు కాబోతుందా అంటే ప్రస్తుతం అవును అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. దీనికి కారణం ఇటీవల సమంత అఖిల్ పుట్టినరోజు నాడు విష్ చేయడమే. అఖిల్ బర్త్ డే రోజు విష్ చేయగా.. ఏజెంట్ సినిమా గురించి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది సమంత. ఇక సమంత మయాసైటిస్ తో బాధపడుతున్నప్పుడు నువ్వు త్వరగా కోలుకోవాలి మై డియర్ సామ్ అంటూ పోస్టు కూడా పెట్టాడు అఖిల్. అయితే విడాకులు తీసుకున్నప్పటికీ సమంతతో అఖిల్ సన్నిహితంగా ఉండడం నాగచైతన్యకు నచ్చడం లేదట. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు కూడా తలెత్తుతున్నాయని టాక్ ఉంది. ఇక అఖిల్ పుట్టినరోజు నాడు నాగచైతన్య కనీసం బర్త్ డే విషెస్ కూడా చెప్పలేదు అంటూ కొన్ని వార్తలు కూడా తెర మీదికి  వచ్చాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికి తెలియదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: