కీరవాణి ప్రసంగంలో అర్థంకాని ఆవిషయం !

Seetha Sailaja
లేటెస్ట్ గా భాగ్యనగరంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆద్వర్యంలో జరిగిన ‘ఆర్ ఆర్ ఆర్’ యూనిట్ సత్కార సభలో కీరవాణి చేసిన ప్రసంగం పై కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. తనకు జరిగిన సన్మానం పై కీరవాణి స్పందిస్తూ ఆస్కార్ అవార్డు తనకు చంద్రబోసు కు ఇచ్చినప్పటికీ ఆ అవార్డు తాము తీసుకున్నప్పటికీ వాస్తవానికి ఈ అవార్డు గౌరవం రాజమౌళికి చెందుతుంది అంటూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు.

అంతేకాదు ఈ అవార్డు విషయంలో తాను కేవలం నిమిత్తమాత్రుడుని అవార్డులు వచ్చాయని పొంగిపోవడం రాలేదని క్రుంగిపోవడం తనకు అలవాటు లేదు అని అంటున్నాడు. అంతేకాదు మరొక అడుగు ముందుకు వేసి తన జీవితంలో అనేక ఎత్తు పల్లాలు చూసిన వ్యక్తిని అని చెపుతూ అవార్డులు గౌరవాలు తనకు నిమిత్తమాత్రంగానే కనిపిస్తాయి అంటూ కామెంట్ చేసాడు.

అంతవరకు చాల హుందాగా మాట్లాడిన కీరవాణి తన ప్రసంగంలో ఎవరికీ ఊహకురాని ట్విస్ట్ యిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘మా ఆవిడ చెబుతుంటుంది..బతికితే ఓరోజు అయినా రామోజీ రావు లా బతకాలాని’ అంటూ తన ఉపన్యాసంలో ఒక మాట వదలడంతో కీరవాణి ప్రసంగంలో రామోజీ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటూ కొందరు ఇండస్ట్రీలో చర్చలు చేస్తున్నారు.  


ఆమధ్య రామోజీరావు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని చూసి ప్రత్యేకంగా కీరవాణి రాజమౌళి లకు ఫోన్ చేసి ఆమూవీకి ఆస్కార్ వచ్చి తీరుతుంది అంటూ కీరవాణి వద్ద ప్రశంసలు కురిపించాడట. ఆ మాటలకు పొంగిపోయిన కీరవాణి ఇలా తన ప్రసంగం మధ్య రామోజీరావు ప్రస్తావన తీసుకు వచ్చి తన గౌరవం చాటుకున్నాడా లేదంటే అతడి మాటల వెనుక ఏమైనా వ్యూహాలు ఉన్నాయా అంటూ మరికొందరు కీరవాణి మాటల పై ఆసక్తికర చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా హైదరాబాద్ లో జరిగిన ‘ఆర్ ఆర్ ఆర్’ యూనిట్ సత్కార సభలో కీరవాణి చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: