ప్రాజెక్ట్ -k.. రెండో భాగం కూడా ఉండబోతోందా..?
ఇప్పటికే పలు క్రేజీ పోస్టర్లతో పాటు ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది చిత్ర బృందం. ఇప్పుడు కూడా మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తూ క్యాచ్ నుంచి రెండో భాగం అంటూ ఈసారి సినిమాలో రైడర్స్ లుక్కుని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో అనే దాని గురించి వీడియోలు విడుదల చేశారు. ఈ సినిమా ఆర్మీ వారికి విలన్సుకు సెపరేట్ సూట్ ఎలా అరేంజ్ చేశారు అనేదాని గురించి ఈ వీడియోలో డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయం తెలియాలి అంటే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ వరకు వేచి ఉండాలి. ఇప్పటికే ఈ చిత్రం 70% షూటింగ్‌ను కూడా పూర్తిచేసుకుంది.ఇక ఈ సినిమా ఎప్పుడు చూడని విధంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం సరైన ఎంపికలను కూడా చిత్ర బృందం తీసుకున్నట్లు తెలుస్తోంది. వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా సీక్వెల్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ప్రభాస్ వీటితోపాటు అది పురుష్, స్పిరిట్ తదితర చిత్రాలలో నటిస్తున్నారు.