ఆ రెండు నెలల్లో కూడా "గేమ్ చెంజర్" విడుదల కష్టమేనా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రామ్ చరణ్ ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక గొప్ప గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. కియారా అద్వానీ ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ , సునీల్ , అంజలి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ మరియు చరణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఇది ఇలా ఉంటే మొదట ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి ఇప్పటికి అనేక సినిమాల విడుదల కన్ఫామ్ అయ్యి ఉండడంతో ఈ మూవీ ని సంక్రాంతి కంటే కాస్త ముందుగా డిసెంబర్ నెలలోనే విడుదల చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే ఈ మూవీ ని డిసెంబర్ లో కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీగా లేనట్లు తెలుస్తోంది. దానితో ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: