అందాల అరబోతలో తగ్గేదిలేదంటున్నా బిగ్ బాస్ నటి....!!

murali krishna
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అనేకమంది సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అసలు ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చిన వారు సైతం జబర్దస్త్ కమెడియన్ అనే పేరుతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమే కాదు టాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాలు చేస్తున్నారు.
అయితే జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ షో కి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. అలా మంచి క్రేజ్ తో పాటు డబ్బులు కూడా వెనకేసుకున్నారు.
అలాంటి వారిలో జబర్దస్త్ సాయి తేజ, అలియాస్ ప్రియాంక సింగ్ ఒకరు. రాజస్థాన్ కు చెందిన ప్రియాంక సింగ్ కుటుంబం వృత్తి రీత్యా శ్రీకాకుళం జిల్లాలో స్థిరపడింది. అక్కడే చదువుకున్న సాయి తేజ పెద్దయిన తర్వాత నటన మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చాడు. అయితే చిన్నప్పటి నుంచి అబ్బాయిగానే ఉన్నా ఆడపిల్లలా రెడీ అవ్వాలని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉండేవాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత జబర్దస్త్ ఆ కోరిక తీర్చేసింది. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ నిజమైన అమ్మాయిలకు సైతం అసూయ పుట్టించేలా అందంగా రెడీ అవుతూ ఉండేవాడు సాయి తేజ.
అయితే చాలాకాలం ఇలా ఒక అబ్బాయి శరీరంలో అమ్మాయిలా జీవించలేను అనే విషయం అర్థం చేసుకుని తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా సెక్స్ మార్పిడి చేయించుకున్నాడు. అప్పటివరకు అబ్బాయిగా ఉన్న సాయి తేజ అమ్మాయిగా మారిపోయి ప్రియాంక సింగ్ గా మరోసారి కొత్త జన్మ ఎత్తింది. ఆమె ట్రాన్స్ జెండర్ గా మారిన సంగతి తెలుసుకున్న జబర్దస్త్ యాజమాన్యం ఆమెను మళ్ళీ షోలోకి తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు.
అయినా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు, మనోస్థైర్యాన్ని కోల్పోలేదు. తన స్నేహితుల అండతో కాలం వెళ్లదీస్తున్న ఆమెకు బిగ్ బాస్ రూపంలో మరో అవకాశం తలుపు తట్టింది. బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వడమే కాదు అందరితో సమానంగా తాను కూడా తన సత్తా ప్రూవ్ చేసుకుంది. అయితే ఇప్పటివరకు పద్ధతిగా చీరకట్టులోనే కనిపిస్తూ వచ్చిన ప్రియాంక సింగ్ తాజాగా హాట్ షో చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మునుపెన్నడూ లేని విధంగా ఎద అందాలు ఆరబోసే విధంగా ఆమె ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె ఫోటోల మీద అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతూ రెచ్చిపోతున్నారు. ఒక ఫోటో మరీ దారుణంగా ఉందని అలాంటి ఫోటో పెట్టి డిలీట్ చేస్తే మాత్రం ఈ లోపు స్క్రీన్ షాట్లు తీయరా? ఏంటి అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఆమె ఫోటోల మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: