"శాకుంతలం" మూవీ బుకింగ్స్ ఓపెన్..!

Pulgam Srinivas
సమంత ... దేవ్ మోహన్ జంటగా రూపొందిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడు ఆఖరుగా రుద్రమదేవి అనే మూవీ కి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. రుద్రమదేవి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఈ సినిమాను రూపొందించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

 ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని 2D మరియు 3D వర్షన్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలాగే కొంత కాలం క్రితమే యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తో అదిరిపోయే సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న సమంత నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క బుకింగ్స్ ఓపెన్ అయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇప్పటికే యశోద మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న సమంత ఈ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: