పుష్ప-2 అమ్మవారి గెటప్ వెనుక.. ఇంత కథ ఉందా?

praveen
సుకుమార్ దర్శకత్వంలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా హిట్ అయి ఎన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఈ సినిమా పాటలు ప్రేక్షకుల నోళ్లల్లో నానుతూనే  ఉన్నాయి అని చెప్పాలి. అంతలా సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. అయితే సీక్వెల్ అనే మాటే తప్ప ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు అని చెప్పాలి.  దీంతో అప్డేట్ కోసం అభిమానులు అందరూ కళ్ళు కాయలకాసేలా ఎదురుచూసారు.

 ఎట్టకేలకు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 లోని అల్లు అర్జున్ లుక్ ని విడుదల చేశారు. అదే సమయంలో అల్లు అర్జున్ ఏకంగా అమ్మవారి గెటప్ లో ఉన్న ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. చీర కట్టుకుని చేతికి గాజులు పెట్టుకుని ఒంటిపై బంగారంతో చేతిలో గన్ పట్టుకొని ఉగ్రరూపం లో కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. అయితే పుష్ప 2 లో అల్లు అర్జున్ వేసిన ఈ గెటప్ కథేంటి అన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ గెటప్ కు అక్కడి ప్రాంతీయ సాంప్రదాయాన్ని ముడిపెట్టి షూట్ చేస్తున్నాడట లెక్కల మాస్టర్ సుకుమార్.

 ప్రతి ఏడాది తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుందట. ఈ జాతరలో పురుషులు మహిళలు లాగా ముస్తాబు కావడం అనే ఆచారం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఇక దీనిని సుకుమార్ పుష్ప 2లో చూపించబోతున్నారట. పూర్వకాలంలో తిరుపతి పరిసర ప్రాంతాలు పాలేగాండ్ల పాలనలో ఉండేవట. ఇక పాలేగాండ్ల వంశం వారు ఆడపిల్లలను వేధించడం అనుభవించడం లాంటివి చేసేవారు. ఎవరైనా అబ్బాయిల కొత్తగా పెళ్లి చేసుకుంటే వధువును తాము ముందుగా అనుభవించి తర్వాతే వరుడు అనుభవించాలని ఆంక్షలు విధించేవారు. ఆ సమయంలో దుర్మార్గుల ఆటలు కట్టించేందుకు స్త్రీ జాతిని రక్షించేందుకు కైకాల కులంలో గంగమ్మ జన్మించిందట. ఇక ప్రజలను రక్షించేందుకు అక్కడ గ్రామ దేవత గంగమ్మ తల్లి పూనుకుంది. అందమైన ఆడపిల్లగా ఎదిగింది. దాంతో ఆమె గంగమ్మ తల్లి అని తెలియక పాలేగాండ్లు ఆమెను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించగా.. విశ్వరూపాన్ని ప్రదర్శించిందట.

దాక్కున్న పాలేగాండ్లను బయటకు రప్పించేందుకు గంగమ్మ తల్లి మారువేశాలలో అటు అడవిలో తిరిగేదట. ఇలా దుష్ట శిక్షణ చేసిందని ఆ ప్రాంతపురాణం చెబుతుంది. ఇక ఇప్పుడు పుష్ప 2లో కూడా సుకుమార్ ఇదే చూపించబోతున్నారట. అందుకే బన్నీ ఆ గెటప్ వేసాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: