ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ ఇప్పట్లో లేనట్టేనా..?

Anilkumar
బాలీవుడ్ లో వార్, పఠాన్ వంటి హై వోల్టేజ్ యాక్షన్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ ఆనంద్ తో ఫ్యాన్ ఇండియా హీరో ప్రభాస్ ఓ బాలీవుడ్ ఫిలిం చేయబోతున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్లో మూవీ కోసం మన టాలీవుడ్ టాప్ బ్యానర్ అయిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఎంతగానో ప్రయత్నించింది.అటు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కూడా ఈ ప్రాజెక్టుపై ఎంతో ఆసక్తిని కనబరిచారు. అంతేకాదు ఇటీవల బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్, ప్రభాస్ కాంబినేషన్లో 'వార్ 2'' చేయడానికి దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రెడీ అయ్యాడని, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్లో నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. 

కానీ కట్ చేస్తే అదంతా మారిపోయింది. 'వార్ 2' లో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారని ఆ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ కాకుండా బ్రహ్మాస్త్ర మూవీ ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్టర్ చేయబోతున్నాడు అంటూ బాలీవుడ్ సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఇది అఫీషియల్ అని కూడా చెప్పేసాడు. ఇటీవల పఠాన్ నెలకొల్పిన సరికొత్త రికార్డ్స్ తో డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ కి బాలీవుడ్ లో డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం అతను హృతిక్ రోషన్, దీపికా పదుకొనేతో 'ఫైటర్' అనే మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. ఆ మూవీ తర్వాత టైగర్ వర్సెస్ పఠాన్ మూవీ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకి ఇటీవల సైన్ కూడా చేశాడు.

యష్ రాజు ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 2024లో మొదలవుతుంది. ఇక ప్రభాస్ కూడా ఇటు తన వరుస ప్రాజెక్ట్ తో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్, మారుతి తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఇప్పట్లో బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ తో ప్రభాస్ మూవీ ఉండే అవకాశం అయితే లేదని అంటున్నారు. బహుశా ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు అన్ని పూర్తయ్యాక వీరి కాంబినేషన్లో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ మూవీ విడుదలకు రెడీగా ఉంది. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: