దసరా మూవీ డైరెక్టర్ కు విలువైన కారును బహుమతి ఇచ్చిన నిర్మాత..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది దర్శకులు ప్రతి సంవత్సరం వస్తుంటారు. అందులో కొంత మంది దర్శకులు మాత్రమే దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకుంటుంటారు. అలాగే వారు దర్శకత్వం వహించిన మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వీరికి అదిరిపోయే రేంజ్ క్రేజ్ కూడా లభిస్తూ ఉంటుంది. అలా దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని ఫుల్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న వారిలో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఒకరు. ఈ దర్శకుడు తాజాగా విడుదల అయిన దసరా మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ ఈ దర్శకుడి కి డబ్ల్యూ సినిమా. నాని హీరోగా నటించిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... సంతోష్ నారాయణ ఈ మూవీ కి సంగీతం వహించాడు .

ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ నే పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. మార్చి 30 వ తేదీన భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలో విడుదల అయిన ఈ మూవీ అన్ని భాషలలో నుండి పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం అద్భుతమైన రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది.

ఇలా ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో తాజాగా ఈ మూవీ నిర్మాత ఈ దర్శకుడికి 80 లక్షల విలువైన బిఎండబ్ల్యూ కార్ ను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఈ దర్శకుడు ఈ సినిమా నిర్మాత నుండి విలువైన బహుమతి ని పొందినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: