ఆ టెక్నాలజీతో ఎన్టీఆర్ "సింహాద్రి" మూవీ రీ రిలీజ్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే  ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించిన ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఎన్టీఆర్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న మూవీ లలో సింహాద్రి మూవీ ఒకటి. ఈ మూవీ కి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా భూమిక , అంకిత ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించారు.
 

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ కి కథను అందించగా ... ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందించాడు. కీరవాణి అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ కు రాజమౌళి కి భూమిక కు అంకిత కు అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది.

ఇలా ఆ రోజుల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేసిన ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే ... ఈ మూవీ ని 4 కే అల్ట్రా హెచ్ డి తో పాటు 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీలో రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి. ఈ మూవీ రీ రిలీజ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాలంగా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: