ట్రెడిషనల్ లుక్ లో మైమరిపిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్..!

Pulgam Srinivas
విక్టరీ వెంకటేష్ ... సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును తెచ్చుకున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి అంజలి గురించి ప్రత్యేకంగా తెలుగు శని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ లో పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మకు ఈ మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి.
 

అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును అంజలి దక్కించుకుంది. ప్రస్తుతం అంజలి ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపాందుతున్న గేమ్ చేంజర్ మూవీ లో కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ కనక అద్భుతమైన విజయం సాధించినట్లు అయితే అంజలి కి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.
 

ఇది ఇలా ఉంటే సినిమాలతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులతో టచ్ లో ఉంటుంది. అందులో భాగంగా తనకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో అంజలి పోస్ట్ చేస్తుంది. తాజాగా అంజలి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం అంజలి కి సంబంధించిన ఈ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: