మీడియాకు హాట్ టాపిక్ గా మారిన రామ్ చరణ్ షర్టు !

Seetha Sailaja

సినిమా హీరోలు హీరోయిన్స్ వేసుకునే రకరకాల ఫ్యాషన్ గార్మెంట్స్ ధరలు అదేవిధంగా వాళ్ళు పెట్టుకునే వాచీలు కళ్ళజోడులు మీడియాకు ఎప్పుడు హాట్ టాపిక్ గానే కొనసాగుతూ ఉంటాయి. ఆమధ్య పవన్ కళ్యాణ్ చేతికి పెట్టుకున్న వాచ్ ధర లక్షలలో  ఉంటుంది అంటూ హడావిడి జరిగిన విషయం తెలిసిందే. ఆఖరికి ‘భారత్ జోడో యాత్ర’ లో రాహుల్ గాంధీ వేసుకున్న టి.షర్ట్ ధర గురించి కూడ అనేక వార్తలు వచ్చాయి.

ఇప్పుడు లేటెస్ట్ గా రామ్ చరణ్ వేసుకున్న బ్లాక్ షర్ట్ గురించి మీడియా వర్గాలలో ముఖ్యంగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. చరణ్ పుట్టినరోజునాడు అతడు హాట్ చేసిన పార్టీలో ఈ షర్ట్ వేసుకున్నట్లుగా ఫోటోలు బయటకు వచ్చాయి. ఆరోజు జరిగిన పుట్టినరోజు పార్టీకి రాజమౌళి కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో పాటు మంచు కుటుంబ సభ్యులు విజయ్ దేవరకొండ జొన్నల గడ్డ సిద్దూ నిఖిల్ హాజరైనట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆరోజు ఆపార్టీలో చరణ్ వేసుకున్న ఆబ్లాక్ షర్ట్ అమెరికాలోని ఒక ఫ్యాషన్ డిజైనర్ తయారుచేసిందని ఆషర్ట్ ను ఉపాసన ఈమధ్య చరణ్ తో కలిసి ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు కొన్నట్లుగా తెలుస్తోంది. దీని ధర 1550 డాలర్లు ఉంటుందని మన రూపాయలలోకి తీసుకుంటే దీని ధర లక్ష రూపాయలకు పైగా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఈషర్ట్ మెగా అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూట్ లో పాల్గొంటూ మధ్యలో ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో నటించే మూవీ కథ ఫినిషింగ్ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం రామ్ చరణ్ తండ్రి కాబోతున్న నేపధ్యంలో ఈ సంవత్సరంలోనే ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ కు వెళ్ళడంతో పాటు అనేక బాలీవుడ్ ఆఫర్లు కూడ వస్తున్న నేపధ్యంలో ఈసంవత్సరం చరణ్ కు మెమరబుల్ సంవత్సరంగా మారే ఆస్కారం ఉంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: