నాని "దసరా" మూవీ ఆ రికార్డును బ్రేక్ చేయగలదా..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా ఊర మాస్ మూవీ అయినటు వంటి దసరా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కొత్త దర్శకుడు అయినటువంటి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించిందు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , భాష తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నట్లు అయితే భారీ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలలో మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లైగర్ మూవీ 9.57 కోట్ల షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టి నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది.

ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను బట్టి ... అలాగే నాని కి ఉన్న క్రేజ్ ను బట్టి చూసినట్లు అయితే నాని హీరోగా రూపొందిన దసరా మూవీ లైగర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన మొదటి రోజు కలెక్షన్ ల రికార్డ్ ను బ్రేక్ చేసి కొత్త సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి నాని హీరో గా రూపొందిన దసరా మూవీ లైగర్ మూవీ రికార్డు ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డు ను రెండు తెలుగు రాష్ట్రాల్లో సృష్టిస్తుందో ... లేదో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: