రామ్ చరణ్ తన తదుపరి మూవీలను ఏ బ్యానర్లో చేయబోతున్నాడో తెలుసా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోయిన సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ ... దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కి "గేమ్ చేంజర్" అనే టైటిల్ ను చిత్ర బృందం తాజాగా ఫిక్స్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ఇప్పటికే తన తదుపరి మూడు మూవీ లను ఏ బ్యానర్ లో చేయాలో డిసైడ్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ తన తదుపరి మూడు మూవీ లను ఏ బ్యానర్ లో చేయబోతున్నాడో తెలుసుకుందాం.


రామ్ చరణ్ తన కెరీర్ లో 16 వ మూవీ ని బూచి బాబు సన దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలబడింది. ఈ సినిమాను మైత్రి మూవీ సంస్థ మరియు వృద్ధి సినిమాస్ సంస్థ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లు సంయుక్తంగా రూపొందించబోతున్నాయి. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ... యు వి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కకబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ కి కన్నడ దర్శకుడు నర్తన్ దర్శకత్వం వహించబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందబోయే మూవీ లో నటించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ బ్యానర్ లో రామ్ చరణ్ నటించిన బోయే సినిమాకు దర్శకుడు ఎవరు అనేది మాత్రం కన్ఫామ్ కానట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: