మహేష్ 28వ మూవీ కోసం ఆ టైటిల్ ని కూడా పరిశీలించారా..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రారంభం అయింది. ఈ మూవీ షూటింగ్ ను అదిరిపోయే భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ మూవీ బృందం ప్రారంభించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా బాగం షూటింగ్ పూర్తి అయ్యింది.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నైట్ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణను మూవీ యూనిట్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాల చిత్రీకరణ ఈ సినిమా కోసం వేసిన భారీ ఇంటి సెట్ లో ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో శ్రీ లీల ... పూజా హెగ్డే ... మహేష్ సరసన హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... జయరామ్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ మహేష్ సంబంధించిన ఈ మూవీ లోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ మూవీలోని మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాకి ఇప్పటి వరకు టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న కారణంతో ఈ మూవీ షూటింగ్ "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి గుంటూరు కారం అనే టైటిల్ ను ఈ మూవీ యూనిట్ కొంత కాలం గతం పరిశీలించినట్లు ... కాకపోతే ఈ టైటిల్ మూవీ యూనిట్ కు అంతా సంతృప్తికరంగా అనిపించకపోవడంతో ఈ టైటిల్ ను పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: