ఎన్టీఆర్ 30 లో 2వ హీరోయిన్ కూడా ఉండనుందా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో తన కెరియర్ లో 30 వ మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటు వంటి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు. ఆచార్య మూవీ తర్వాత చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకొని కొరటాల ... ఎన్టీఆర్ మూవీ కోసం అద్భుతమైన కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని పూజా కార్యక్రమాలతో అధికారికంగా చిత్ర బృందం ప్రారంభించింది. ఈ పూజా కార్యక్రమాలకు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి , ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ మూవీ కి రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. జాన్వి కపూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్ లు నటించబోతున్నట్లు అందులో మెయిన్ హీరోయిన్ గా జాహ్న కపూర్ ను ఇప్పటికే చిత్ర బంధం కన్ఫామ్ చేసుకోగా ... రెండవ హీరోయిన్ కోసం చిత్ర బృందం ప్రస్తుతం వెతుకులాటలో ఉన్నట్లు అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి అనన్య పాండే ను ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా తీసుకోవడానికి ఈ చిత్ర బృందం ప్రణాళికలను వేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అనన్య పాండే కొంత కాలం క్రితం లైగర్ అనే పాన్ ఇండియా మూవీ లో నటించి ప్రేక్షకులను అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: