రీ రిలీజ్ లో కూడా ఆయనదే హవా.. తగ్గేదేలే..!

Divya
గత ఏడాది మహేష్ బాబు సినిమాలు ఏవీ లేని నేపథ్యంలో అభిమానులు నిరాశ చెందకుండా మహేష్ బాబు సినీ కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పోకిరి సినిమాను రీ రిలీస్ చేసి మళ్లీ ఆయనను పాపులారిటీ చేశారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ కూడా తమ అభిమాన హీరోల సినీ కెరియర్ లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ కలెక్షన్స్ వసూలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు కూడా రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతోందనే చెప్పాలి. మహేష్ బాబు పోకిరి సినిమాను మొదలుకొని నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఆరెంజ్ సినిమా వరకు చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.
అయితే ఈ రీ రిలీజ్ లో భాగంగా ఎన్నో సినిమాలు కలెక్షన్స్ బాగా వసూలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే హైయెస్ట్ రికార్డు సృష్టించింది.  అంతే కాదు రీ రిలీజ్ లో కూడా మనదే హవా అన్నట్లుగా నిరూపించింది.. రీ రిలీజ్ సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా రూ.1.65 కోట్ల తో అగ్రస్థానంలో నిలిచింది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా రూ.1.26 కోట్లతో రికార్డు సృష్టించింది. ఇక మూడవ స్థానంలో మహేష్ బాబు ఒక్కడు సినిమా రూ.90 లక్షలు రాబట్టి రికార్డు సృష్టించగా .. రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా గతంలో డిజాస్టర్ గా నిలిచింది.  అయితే ఇప్పుడు రూ.75 లక్షలు కలెక్ట్ చేసి పర్వాలేదనిపించింది.
ఇక చివరి స్థానంలో పోకిరి రూ.69 లక్షల కలెక్షన్ సాధించింది. అయితే ఈ లెక్కలన్నీ ఒక నైజాం ఏరియా కి పరిమితం అని చెప్పాలి. మొత్తానికైతే రీ రిలీజ్ లో కూడా తన హవా తగ్గించకుండా మళ్ళీ తన పేరు నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: