పవన్ కళ్యాణ్: అప్పట్నుంచి సినిమాలతో ఫుల్ బిజీ?

Purushottham Vinay
పవన్ కళ్యాణ్ : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొదటి సారి పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. ఇప్పటికే ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోండగా, ఈ సినిమాను టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమా విడుదల కాకముందే, పవన్ తన తరువాత సినిమాలని వరుసబెట్టి స్టార్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను కన్ఫర్మ్ చేసిన పవన్ కళ్యాణ్, మరో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను చేయబోతున్నాడు.ఇక OG అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగస్టర్ పాత్రలో నటిస్తున్నట్లు సుజీత్ అండ్ టీమ్ వెల్లడించారు. 


ఇక ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ రెండు సినిమాలను కూడా ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ ఏకంగా 10 రోజుల డేట్స్‌ను కేటాయించగా OG సినిమాను కూడా వచ్చే నెలలో స్టార్ట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ పూర్తిగా రెడీ అవుతున్నాడట. అయితే ఈ సినిమా కోసం బల్క్‌లో డేట్స్ ఇచ్చాడట పవర్ స్టార్ పవన్ కల్యాణ్.ఇక ఈ రెండు సినిమాల షూటింగ్‌లతో పవన్ కళ్యాణ్ ఏప్రిల్ నెల మొత్తం బాగా బిజీ బిజీగా ఉండబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈ సినిమాలను వీలనైంత త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాను పవన్ కళ్యాణ్ ముందుగా పూర్తి చేస్తాడా అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: