ఆ కారణంతో మహేష్ మూవీని వాయిదా వేయనున్నారా..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా సర్కారు వారి పాట అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో సముద్ర ఖని ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. కీర్తి సురేష్ ఈ మూవీ లో మహేష్ కు జోడిగా నటించింది. ఈ మూవీ మంచి అంచనాలు నడుమ విడుదలై మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ ... త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. అలాగే ఈ మూవీ షూటింగ్ కూడా చాలా భాగమే పూర్తయింది. ఈ మూవీ షూటింగ్ ను ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో ఈ చిత్ర బృంద నిర్వహిస్తుంది. శ్రీ లీల ... పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ నిర్మాత నాగ వంశీ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించాడు.

కాకపోతే ఆ తర్వాత రజనీ కాంత్ హీరోగా రూపొందిన జైలర్ మూవీ ని ... రన్బీర్ కపూర్ హీరోగా రూపొందిన యానిమల్ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందాలు ప్రకటించాయి. అలాగే తాజాగా చిరంజీవి హీరోగా రూపొందిన "భోళా శంకర్" మూవీ ని కూడా ఇదే తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇలా ఈ మూడు మూవీల విడుదల తేదీలు ఇదే తేదీన ఉండడంతో మహేష్ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: