తనకు ఫ్లాప్ ఇచ్చిన టైమ్ ను ఎంచుకున్న విజయ్ ... ఈసారైనా హిట్ కొట్టేనా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ ... తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు మూవీతో హీరోగా మంచి విజయాన్ని అందుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ... గీత గోవిందం ... టాక్సీ వాలా వంటి విజయవంతమైన మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ హీరోగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈ యువ హీరో సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే విజయ్ ఆఖరుగా లైగర్ అనే బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని పూరి కనెక్ట్స్ ... ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై పూరి జగన్నాథ్ మరియు కరన్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఆగస్టు 25 వ తేదీన తెలుగు , తమిళ  , కన్నడ ,  మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఇలా పోయిన సంవత్సరం ఆగస్టు ఆఖరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినా విజయ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీన తాను హీరోగా నటించిన ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి దాదాపు లైజర్ సమయం.లోనే ఖుషి మూవీ తో విజయ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ మూవీతో అయిన విజయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి శివ నార్వన దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: