దాస్ కా ధమ్కీ: హిట్టా? ఫట్టా?

Purushottham Vinay
టాలీవుడ్ చిన్న హీరో విశ్వక్ సేన్ డైరెక్టర్ గా హీరోగా ప్రొడ్యూసర్ గా చేసిన సినిమా దాస్ కా దంకీ.. తమిళ బ్లాక్ హాట్ బ్యూటీ నివేద పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈరోజు విడుదల అయ్యింది. ఇక కథేంటి? సినిమా హిట్టా ఫట్టా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక హీరో ద్విపాత్రాభినయం చేయడం.. ఒకరు సమస్యల్లో ఉంటే.. మరొకరు వచ్చి వాళ్లను కాపాడటం అనేది చాలా పాత కాన్సెప్ట్. అది ఇప్పుడు కాదు..చాలా సినిమాల్లో ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఫార్ములా. ఈ కథనే మరోసారి ధమ్కీలోనూ చూపించాడు దర్శకుడు ఇంకా హీరో విశ్వక్ సేన్. కాకపోతే సినిమాలో కొన్ని ట్విస్టులు పెట్టాడు.ఇక అవి చూస్తే కానీ అర్థం కావు..  ఫస్ట్ అరగంట కేవలం హీరో హీరోయిన్ ట్రాక్ మీదే నడుస్తుంది కథ. ఇది బాగా నెమ్మదిగా సాగే బోరింగ్ ట్రాక్. పైగా డబ్బుందని మోసం చేసే క్రమంలో విశ్వక్ సేన్ వేసే వేశాలు చాలా మూవీలను గుర్తుకు తెస్తాయి.


ఒక హోటల్ వెయిటర్‌గా ఉండి.. డబ్బులున్న అమ్మాయిని మేనేజ్ చేయడానికి అతడు పడే తంటాలు అయితే కాస్త కామెడీ పుట్టించాయి. అయితే అసలు కథలోకి వెళ్లే దాకా మాత్రం స్లో నెరేషన్ ఆడియన్స్ ని ఇబ్బంది పెడుతుంది.అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చే కథ కూడా ఊహించదగ్గదిగానే ఉంటుంది కానీ ట్విస్టులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రెండో విశ్వక్ సేన్ కారెక్టర్ మాత్రం పర్వాలేదు అనిపించింది. అసలు ఎవరూ ఊహించని రేంజ్‌లో ఆ పాత్రను డిజైన్ చేసాడు  విశ్వక్. అందులో అతని పర్ఫార్మెన్స్ బాగుంటుంది. క్లైమాక్స్ టైటిల్స్ పడిన తర్వాత కూడా కథను ముందుకు నడిపించిన తీరు చాలా బాగుంది. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటుందనే విషయాన్ని చాలా బాగా నెరేట్ చేసాడు విశ్వక్. ఓవరాల్‌గా రొటీన్ సినిమా అయినా ఒకసారి చూసేయొచ్చు.మరి అద్భుతమైన సినిమా కాదు గాని జస్ట్ యావరేజ్ సినిమాగా చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: