ఒక్కడినే ఎందుకు నష్టపోవాలి అంటున్న దిల్ రాజు...!

murali krishna
టాలీవుడ్ లో ఉన్నా ప్రెసెంట్ స్టార్ ప్రొడ్యూసర్స్ లలో ఒకరైన దిల్ రాజు అలియాస్ వెంకట రమణా రెడ్డి. దిల్ సినిమా నిర్మాణంతో అతని ఇంటి పేరుగా ఆ చిత్రం మారిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోనే అత్యంత పేరు ప్రఖ్యాతలు ఉన్న నిర్మాతగా సక్సెస్ఫుల్ గా సినిమాల నిర్మిస్తూ దూసుకుపోతున్నాడు దిల్ రాజు.
ఇక 2003 సంవత్సరంలో మొదలైన సినిమా నిర్మాణం ఇప్పటికీ సక్సెస్ఫుల్గానే కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఓ థియేటర్ కి జనాలు రావడం లేదు కాబట్టి తనదైన రీతిలో సినిమాలను చేస్తూ విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. దిల్ రాజు లాంటి నిర్మాత ఆ రోడ్డెక్కి ఇతర సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు అంటే ప్రస్తుత సినిమాల యొక్క పంథా. ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
సక్సెస్ తన ఇంటి పేరుగా దిల్ రాజు ఎన్నో సినిమాలను నిర్మిస్తూ వెళుతున్నాడు అయితే ఇటీవల కాలంలో అతడు నిర్మించే పద్ధతి కూడా చాలా మారినట్టుగా కనిపిస్తుంది. 500 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్న ఈ టైంలో కూడా అత్యంత చిన్న సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ, చిన్న నటులకు, చిన్న దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు. అందుకు ఉదాహరణ మొన్న వచ్చిన బలగం సినిమా.ఈ సినిమా కోసం దిల్ రాజు చాలానే కష్టపడ్డాడు. తనది కానీ యాసలో, భాషలో ప్రచారం నిర్వహిస్తూ ఈ చిత్రానికి విజయాన్ని అందించడంలో తన వంతు కృషి చేశాడు. ఇక తెలుగు సినిమాలు బాగా తగ్గించేసాడు ఇటీవల కాలంలో పక్క భాషల్లో కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు. మొన్నటి సంక్రాంతికి వారీసు వంటి ఒక సినిమాని నేరుగా తమిళనాడులో విడుదల చేయడం విశేషం. ఇక హిందీలో కూడా తానేంటో నిరూపించుకుంటున్నాడు. జెర్సీ హిట్ మొదటి పార్ట్ మరియు ఎఫ్2 సినిమాలను హిందీలో నిర్మించాడు. ఇందులో ఎఫ్2 సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇక అక్కడ నిర్మాతలతో కలిసి కూడా కొన్ని సినిమాలు తీస్తున్నాడు ఒక్కడే తీస్తే ఒకవేళ సినిమా పరాజయం పాలైతే తాను ఒక్కడే ఎందుకు నష్టపోవాలి అని అనుకుంటున్నాడో ఏమో కానీ మొత్తానికి ఈ పక్క ప్రొడక్షన్స్ తో చేతులు కలుపుతూ సినిమాలు నిర్మిస్తూ తలా ఒక రూపాయి అన్న విధంగా దిల్ రాజు పద్ధతి కనిపిస్తోంది. 2009లో ఇలా కోలాబరేటెడ్ ప్రొడక్షన్స్ లో సినిమాలు తీయడం మొదలుపెట్టిన దిల్ రాజుశాకుంతలం వరకు ఎన్నో సినిమాలను నిర్మించాడు. రామ్ చరణ్ 15వ సినిమాను కూడా దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఐతే రాంచరణ్ -శంకర్ మూవీ పై ఏంతో ఆశలతో ఉన్నాడు మన దిల్ రాజు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: