ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతున్న ప్రణీత..!!

Divya
బావ అనే సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది హీరోయిన్ ప్రణీత సుభాష్.. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగు లో కంటే కన్నడ ఇండస్ట్రీలోనే మొదట ఎంట్రి ఇచ్చింది.అక్కడ సక్సెస్ అవ్వగానే మహేష్ బాబు హిట్ మూవీ పోకిరి కన్నడ రీమిక్స్ లో నటించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో ఇక అవకాశాలు వెలుపడ్డాయి తెలుగులో సిద్ధార్థకు జోడిగా భావాని చిత్రంతో నటించిన ఆ తర్వాత పవన్తో అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది.

ఆ వెంటనే ఎన్టీఆర్ తో రభస తదితర చిత్రాలలో నటించిన సక్సెస్ కాలేక పోయింది. కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ అమ్మడికి అక్కడ ఒక మూవీ చేసే అవకాశం దొరికింది.ఇదంతా ఇలా ఉండగా రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న ప్రణీత పెళ్లి తర్వాత కొన్ని నెలలు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత ఒక పాప కూడా జన్మించింది. అయితే తల్లి అయిన తర్వాత ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ రెగ్యులర్గా తనకు సంబంధించిన అప్డేట్లను తెలియజేస్తూ ఉంటుంది .అలాగే ఈ మధ్య వర్కౌట్ సంబంధించి గ్లామర్ డోస్లను కూడా పెంచేస్తూ కనిపిస్తోంది.
తాజాగా మరొకసారి ట్రెడిషనల్ దుస్తులను ప్రణీత గ్లామర్ షో తో రెచ్చిపోతోంది.ఈ లుక్ అచ్చం యువరాణిలా కనిపిస్తోంది అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. లుక్ పరంగ కూడా ఈ ముద్దుగుమ్మ మరల హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ లుక్ చూసిన తర్వాత ఎవరైనా సరే ఈమెకు అవకాశం ఇవ్వాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్. ప్రస్తుతం ప్రణీత సుభాష్ కు సంబంధించి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: