విశ్వక్ సేన్ ను ఆ పాన్ ఇండియా దర్శకుడితో పోల్చిన నివేత పేతురాజ్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్ లలో నివేత పేత్ రాజ్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన మెంటల్ మదిలో మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు మూవీ లలో నటించిన ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో ... నటన తో ప్రేక్షకులను ఆకట్టుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ క్యూట్ హీరోయిన్ దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. విశ్వక్ సేన్ ఈ మూవీ లో హీరో గా నటించాడు. అలాగే ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంది.

అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూvలో పాల్గొన్న నివేత ... విశ్వక్ పై ప్రశంసల వర్షం కురిపించింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నివేత మాట్లాడుతూ ... తమిళ సినిమా ఇండస్ట్రీ లో లోకేష్ కనకరాజు ఎలాంటి దర్శకుడో ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విశ్వక్ కూడా అలాంటి దర్శకుడే అని నివేత ... విశ్వక్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఇది ఇలా ఉంటే ఇది వరకు విశ్వక్ "పలకనామ దాస్" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. దాస్ కా దమ్కి మూవీ విశ్వక్ దర్శకత్వం వహించిన రెండవ సినిమా. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: