మరో క్రేజీ మూవీ లో ఆఫర్ కొట్టేసిన మాళవిక..!

Pulgam Srinivas
తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తమిళ మూవీ లలో నటించి అద్భుతమైన గుర్తింపును కోలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తలపతి విజయ్ హీరో గా రూపొందిన మాస్టర్ అనే తమిళ మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఈ సినిమా మాస్టర్ అనే పేరు తోనే తెలుగు లో కూడా విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. దీనితో ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరో క్రేజీ సినిమా ఆఫర్ ను దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మొదటి హీరోయిన్ గ శ్రీ లీల ను చిత్ర బృందం ఎంచుకోగా ... రెండవ హీరోయిన్ గ మాళవిక మోహన్ ను మూవీ యూనిట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని మైత్రి మూవీ సంస్థ వారు నిర్మించనుండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించనున్నాడు. ఏ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: