కృష్ణవంశీ తో కన్నీరు పెట్టించిన రమ్యకృష్ణ !

Seetha Sailaja
‘నక్షత్రం’ మూవీ షాక్ నుండి తేరుకోవడానికి కృష్ణవంశీ కి చాల సంవత్సరాలు పట్టింది. జాతీయస్థాయిలో అవార్డ్ పొందిన మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’ మూవీని ‘రంగమార్తాండ’ మూవీగా మార్చి దర్శకత్వం వహించిన కృష్ణవంశీ ఈ మూవీని విడుదల చేయడానికి కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈమూవీని చూసిన సినిమా ప్రముఖులు ఈమూవీ చాల బాగుంది అంటూ ప్రశంసలు కురిపించారు కానీ ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈమూవీ వచ్చేవారం విడుదలకాబోతోంది. నాని ‘దసరా’ మూవీతో పోటీపడుతూ ఈమూవీ చేస్తున్న సాహసం పై చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈమూవీలో కృష్ణవంశీ భార్య రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించింది. ఈమూవీ విశేషాలను షేర్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమ్యకృష్ణతో ఒక సీన్ చేసినప్పుడు తాను పడ్డ బాధ కృష్ణవంశీ వివరించాడు.

ఈ సినిమా చివర్లో తన భార్య రమ్యకృష్ణ మీద తీసిన సన్నివేశాలు తీసేటపుడు చాలా బాధ పడ్డానని గుండె రాయి చేసుకుని ఆ సీన్లు తీశానని కృష్ణవంశీ చెపుతున్నాడు. ఈమూవీలో ఆమెది చాల పవర్ ఫుల్ పాత్ర అని చెపుతూ రమ్యకు శక్తిమంతమైన కళ్లు ఉన్నాయి అని అంటూ అరుపులు కేకలు లేకుండా కేవలం కళ్లతోనే నటించాలని తాను చెప్పగానే ఆమె చాల సహజంగా నటించిన విషయాన్ని తెలియచేసాడు. ఈసినిమాకు సంబంధించి తన మేకప్ హెయిర్ స్టైల్ తనకు తానే సెట్ చేసుకున్న విషయాన్ని వివరిస్తూ ఈసినిమా చివరిలో కొన్ని సన్నివేశాలు తీసేడప్పుడు తాను పడ్డ మనోవేదన వివరించాడు.

ఈసినిమా క్లైమాక్స్ తీస్తున్నప్పుడు తనకు ఒక సెంటిమెంట్ అడ్డొచ్చిందనీ అయినా తీసానని చెపుతూ ఆసీన్ తీసిన తరువాత తనకు కొన్ని రోజులు నిద్ర పట్టలేదని వివరించాడు. చివరిలో రమ్యకృష్ణ చనిపోయే సన్నివేశం ఉంటుందని ఆ సీన్ లో ఆమె చాల సహజంగా నటిస్తుంటే తాను షూట్ చేయడానికి పడ్డ బాధను వివరిస్తూ తన కంట కన్నీరు వచ్చిన సందర్భాన్ని వివరించాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: