24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 తెలుగు మూవీ టీజర్ లు ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన సినిమాలలో కొన్ని సినిమాలకు సంబంధించిన టీజర్ లకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్  లభించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన టీజర్ లలో అత్యధిక వ్యూస్ 24 గంటల్లో సాధించిన టాప్ 5 మూవీలు ఏవో తెలుసుకుందాం.


రెబల్ స్టార్ ప్రభాస్ పోయిన సంవత్సరం రాధే శ్యామ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించగా ... రాధా కృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 42.67 మిలియన్ వ్యూస్ ను సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి 24 గంటలలో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమా టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 23.06 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 22.52 మిలియన్ వ్యూస్ లభించాయి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన సరిలేరు నీకెవరు మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 14.64 మిలియన్ వ్యూస్ ను సాధించింది. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీvలోని రామరాజు ఫ్రమ్ భీమ్ మూవీ టీజర్ కు 24 గంటల్లో 14.14 మిలియన్ వ్యూస్ లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: