టైట్ డ్రెస్ లో మైమరపిస్తున్న లావణ్య త్రిపాఠి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి.
 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ నటించిన కొన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో లావణ్య చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ ముద్దుగుమ్మ హ్యాపీ బర్త్ డే అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టు కోలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ పులి మేక అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది.

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జీ 5 డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలా సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా లావణ్య అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: