"ఆర్ఆర్ఆర్" మూవీ లేటెస్ట్ కలెక్షన్స్..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా ... ఆలియా భట్ ... ఒలీవియా మోరిస్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ... జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ లో కొమరం భీం పాత్రలో నటించాడు. 

ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... అజయ్ దేవగన్ ... శ్రేయ ... సముద్ర ఖని ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభించాయి. మొదట విడుదల అయినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 1152.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఆ తర్వాత ఈ మూవీ ని కొంత కాలానికి జపాన్ లో విడుదల చేశారు. జపాన్ లో కూడా ఈ మూవీ కి బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ఇప్పటికీ కూడా జపాన్ లో సూపర్ కనెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు జపాన్ లో ఈ మూవీ 81.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. అలాగే ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేశారు. అందులో భాగంగా ఈ మూవీ కి 2.5 కోట్ల కలెక్షన్ లు లభించాయి. మొత్తంగా చూసుకుంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1236.5 కోట్ల కలెక్షన్ లు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr

సంబంధిత వార్తలు: