భోళా శంకర్ మూవీలో ఆ యంగ్ హీరో ... అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సుశాంత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో తమన్నా హీరోయిన్ గా రూపొందిన కాళిదాసు మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మొదటి మూవీ తోనే మంచి విజయం అందుకున్న ఈ హీరో తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అనేక మూవీ లలో నటించిన ఈ యువ హీరో అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.
 

ముఖ్యంగా సుశాంత్ హీరోగా రూపొందిన చి లా సౌ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ యువ హీరో సినిమాల్లో హీరో పాత్రలో మాత్రమే కాకుండా ఇతర ముఖ్యపాత్రలలో కూడా నటిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అలా వైకుంఠపురంలో సినిమాలో కీలక పాత్రలో నటించిన సుశాంత్ ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న రావణాసుర మూవీలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మరో మూవీ లో కీలకపాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలబడింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... కీర్తి సురేష్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది.  ఈ సినిమాలో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఈ సినిమా బృందం తాజాగా సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: