బూతులు పక్కన పెడితే.. వెంకీ మామ రికార్డు సృష్టించాడుగా?

praveen
వెంకటేష్ సినిమాలు అంటే.. ఫ్యామిలీ అందరూ కూర్చొని హాయిగా చూసే లాగా ఉంటాయి. ఇక ఇలాంటి సినిమాలు తీశాడు కాబట్టే ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా అభిమానులుగా ఉన్నారు. ఇక వెంకటేష్ అంటే ఒక ఫ్యామిలీ హీరో అని ప్రత్యేకమైన ఇమేజ్ కూడా ఏర్పడింది. వెంకటేష్ సినిమా అంటే కుటుంబ సమేతంగా చూడవచ్చని అటు ప్రేక్షకులందరూ కూడా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అలాంటి వెంకటేష్ ఇటీవల రానా నాయుడు వెబ్ సిరీస్లో నటించి తన అభిమానులందరికీ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి.

 ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న వెంకటేష్ మితిమీరిన సెక్స్ సన్నివేశాలలో నటించడం.. అంతకుమించి బూతు డైలాగులు చెప్పడం ఇక ఫాన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఒక్క వెబ్ సిరీస్ తో వెంకటేష్ ఇమేజ్ మొత్తం డామేజ్ అయిపోయిందంటూ ఎంతోమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చేశారు. ఇక వెంకటేష్ రానా నాయుడు వెబ్ సిరీస్లో చెప్పిన బూతు డైలాగుల గురించి కాస్త పక్కన పెడితే.. ఈ వెబ్ సిరీస్ ద్వారా వెంకటేష్ హిట్ అయినట్లేనా అంటే ప్రస్తుతం అవును అనే టాక్ వినిపిస్తుంది.

 నెట్ ఫ్లిక్స్  లో ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమ్ అవుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఓటిటి లో ది బెస్ట్ షో గా నెంబర్ ర్యాంకు సొంతం చేసుకుంది రానా నాయుడు వెబ్ సిరీస్. దీన్నిబట్టి చూస్తే ఎక్కువ మంది ప్రేక్షకులు పైపైకి విమర్శలు చేస్తున్న ఎందుకో ఈ వెబ్ సిరీస్ చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అన్నది తెలుస్తుంది. ఇక ఈ సిరీస్ కు నెంబర్ వన్ ర్యాంకు రావడం చూస్తే ఇక వెంకటేష్ ఈ వెబ్ సిరీస్ ద్వారా హిట్టు కొట్టేశాడు అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజ ఓటిటి ప్లాట్ఫామ్ పై నెంబర్వన్ గా ట్రెండ్ కావడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక రకంగా తన ఫస్ట్ సిరీస్ తోనే వెంకీ మామ హిట్టు కొట్టాడని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: