అరుదైన ఘనత సాధించిన ఆ స్టార్ హీరోలు...!!

murali krishna
ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డు వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ సంవత్సరం మాత్రం ఆస్కార్ వేడుకలలో మన తెలుగు సినిమా తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఇలా తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై తన జెండా ను ఎగరేసింది. రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన సినిమాకు ఆస్కార్ అవార్డు  రావడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణంగా  అయితే నిలిచింది.
ఇలా ఆస్కార్ అవార్డుల ను చాలా గౌరవంగా భావిస్తారు ఇకపోతే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఆస్కార్ అఫీషియల్ ఇంస్టాగ్రామ్ లో పలువురు సెలబ్రిటీలను ఫాలో అవుతూ ఉంటారటా.. అయితే ఆస్కార్ తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ లో కేవలం ఇద్దరే ఇద్దరు ఇండియన్ హీరోలను మాత్రమే ఫాలో అవుతుంది.ఇలా ఆస్కార్ తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఫాలో అవుతున్నటువంటి ఆ ఇద్దరు ఇండియన్ హీరోస్ ఎవరు అంటే . ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్ ఒకరు అలాగే మరొకరు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్. ఇలా ఆస్కార్ తన ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ హ్యాండిల్స్ లో ఇద్దరు ఇండియన్ హీరోలను మాత్రమే ఫాలో అవుతున్నారని తెలియడంతో వీరి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ అండ్ షారుఖ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో.. ది రియల్ గ్లోబల్ స్టార్స్ అంటూ తెగ సందడి చేస్తున్నారు. ఇక పోతే ఆస్కార్ అందుకున్నటువంటి rrr చిత్ర బృందం నేడు ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ కి చేరుకున్నారని తెలుస్తుంది..ఇలా వీరందరూ ఎయిర్ పోర్ట్ లో సందడి చేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు అలాగే మీడియా కూడా చుట్టుముట్టారు. అయితే వీరు మీడియాతో ఏమాత్రం కూడా మాట్లాడకుండా జై హింద్ అంటూ మరోసారి అందరి మనసును అయితే దోచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: