పవన్ ... సాయి తేజ్ మూవీ గురించి అలా స్పందించిన ప్రొడ్యూసర్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని రోజుల్లో సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుబోయే వినోదయ సీతం తెలుగు రీమిక్ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ లో పవన్ తో పాటు యంగ్ హీరో సాయి దరమ్ తేజ్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ఈ ఇద్దరు మెగా హీరోలు ఒకే మూవీ లో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ మొదలు కాకముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ సినిమాకు రీమేక్ అయినప్పటికీ ఈ మూవీ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండడం కోసం అనేక మార్పులు ... చేర్పులు ఈ సినిమా కథలో చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లో రెండు పాటలను కూడా జోడించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి తేజ్ సరసన శ్రీ లీల గాని కేతిక శర్మ గాని హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చాలా తక్కువ రోజులను కేటాయించనున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ షూటింగ్ ను కూడా చాలా స్పీడ్ గా రూపొందించి ఈ మూవీ ని అతి తక్కువ రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకోరావడానికి ఈ మూవీ యూనిట్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రొడ్యూసర్ అయినటువంటి వివేక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లను ప్రకటించడానికి ఇంకా టైమ్ ఉంది ... ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లను తర్వాత చెబుతాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: