"ఎస్ఎస్ఎంబి 28" టైటిల్ అనౌన్స్మెంట్ ఆ తేదీనే..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. దానితో ఈ మూవీ చిత్రీకరనను  ఈ చిత్ర బృందం "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తోంది. ఈ మూవీలో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు. పూజ హెగ్డే ఇది వరకే మహేష్ బాబు తో కలిసి మహర్షి సినిమాలో నటించగా ... శ్రీ లీల మాత్రం మొదటి సారి మహేష్ తో కలిసి నటిస్తోంది.

ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ను భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ  చిత్ర బృందం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ ని దర్శకుడు త్రివిక్రమ్ ఫ్యామిలీ కథతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ కి టైటిల్ ను ఈ చిత్ర బృందం ఫిక్స్ చేయకపోవడంతో తాజాగా ఈ మూవీ టైటిల్ విడుదలకు సంబంధించిన ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి.

కాగా తాజాగా మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణను జరుపుకుంటున్న మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ యొక్క మూవీ టైటిల్ ను మార్చి 22 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ లెవెల్లో అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: