"మగధీర" రీ రిలీజ్ ఆగిపోయిందా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీ రోగా నటించిన రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ మూవీ లలో మగధీర మూవీ ఒకటి. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో రెండవ మూవీ గా తెరకెక్కింది.

ఈ సినిమాకు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో కీరవాణి అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. చాలా సంవత్సరాల క్రితం భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా కలెక్షన్ ల పరంగా ఎన్నో కొత్త కొత్త రికార్డు లను ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించింది. ఈ మూవీ తో రామ్ చరణ్ ... కాజల్ అగర్వాల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అలాగే రాజమౌళి కి కూడా ఈ మూవీ తో అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది.

ఇలా ఆ కాలంలో బ్లాక్ బాస్టర్ విజయం సాధించి ఎన్నో కొత్త రికార్డులను నమోదు చేసిన ఈ మూవీ ని రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ ని ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్ లలో రీ రిలీజ్ చేయలేక పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: