నాగచైతన్య "కస్టడీ" టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అక్కినేని నాగ చైతన్య పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో  బంగార్రాజు మూవీ లో నాగార్జున తో కలిసి నాగ చైతన్య హీరో గా నటించాడు. ఆ తర్వాత అమీర్ ఖాన్ హీరో గా రూపొందిన హిందీ సినిమా లాల్ సింగ్ చడ్డ లో నాగ చైతన్య ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ తో నాగ చైతన్య హిందీ పరిశ్రమంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్యు మూవీ లో నాగ చైతన్య హీరో గా నటించాడు. ఈ మూవీ లలో బంగార్రాజు మూవీ మంచి విజయం అందుకుంది. ఇలా పోయిన సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను అలరించిన చైతన్య ఈ సంవత్సరం కస్టడీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ కి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా ... ఇళయ రాజా ... యువన శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... ప్రియమణి ... అరవింద స్వామి ఈ సినిమాలో కీలకపాత్రలో నటించారు.

ఈ సినిమాను మే 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యొక్క టీజర్ ను ఈ రోజు అనగా మార్చి 16 వ తేదీన సాయంత్రం 4 గంటల 51 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: