రాజమౌళి చేసిన పని వల్లే.. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు : ఆర్జీవి

praveen
రాంగోపాల్ వర్మ.. ఈ పేరు ఎక్కడైనా వార్తల్లో కనిపించింది అంటే చాలు మళ్ళీ ఈయన ఏం కామెంట్స్ చేశాడు.. దేని గురించి మాట్లాడాడు.. ఎవరిని టార్గెట్ చేశాడు అన్నదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వర్మ చేసిన కామెంట్స్ తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక ఎన్ని పనులు ఉన్నా సరే వర్మ పేరు కనిపిస్తే ఎందుకో ఒక క్లిక్ ఇచ్చి ఆయన చేసిన కామెంట్స్ తెలుసుకోవాలని ఆత్రుతను చూపిస్తూ ఉంటారు అని చెప్పాలి. అంతలా రాంగోపాల్ వర్మ తన కామెంట్స్ తో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన ఏం చేసినా అది ఎంతో భిన్నంగా ఉంటుంది అని చెప్పాలి.

 ఆయన స్టైలే సపరేట్ అన్న విధంగా కామెంట్స్ ఉంటాయి. నా దారి రహదారి అన్నట్లుగానే ఆయన ఎప్పుడు వ్యవహరిస్తూ ఉంటాడు. ఎప్పుడు మనసులో ఉన్నది బయటికి మాట్లాడుతూ అందరికి షాక్ ఇస్తూ ఉంటాడు అని చెప్పాలి. రాంగోపాల్ వర్మ ని అందరూ బోల్డ్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడూ బోల్డ్ ఇంటర్వ్యూ లతో రచ్చ చేస్తూ ఉంటాడు  కానీ సామాజిక సమస్యలపై కూడా రాంగోపాల్ వర్మ స్పందించే తీరు అభిమానులందరినీ ఫిదా చేసేస్తూ ఉంటుంది అని చెప్పాలి. అలాంటి రాంగోపాల్ వర్మ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 రాజమౌళి చేసిన రెండు పనుల వల్లనే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు అంటూ రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. అందులో ఒకటి సినిమా బాగుంటే 2000 కోట్లు వసూలు చేస్తుందని రాజమౌళి ప్రూవ్ చేశారు. ఇక రెండవది రాజమౌళి ఇచ్చిన క్వాలిటీని చూసిన తర్వాత ఏ సినిమాను చూసిన అంతగా ప్రేక్షకులకు ఎక్కట్లేదు. దీనివల్ల ప్రతి దర్శకుడు పై ఒత్తిడి పెరిగిపోయింది. ఇక ఈ పోటీలో అందరూ మంచి సినిమాలను చేస్తున్నారు. దీనికి ఉదాహరణ కన్నడ నుంచి వచ్చిన కే జి ఎఫ్ 2. ఇలాంటి సినిమాలు ఇంకా రావచ్చు. అయితే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలని అంటూనే.. మరోవైపు భారీ బడ్జెట్ పెట్టకపోతే త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు చేయలేమని ఎంతోమంది అంటుంటారు అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: