చరణ్ విషయంలో కాజల్ చేసింది తప్పే అంటున్న మెగా ఫ్యాన్స్...!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, ఇతర స్టార్ హీరోలకు జోడీగా నటించగా చరణ్, కాజల్ కు జోడీగా ఎక్కువగా నటించడం గమనార్హం.
అయితే కాజల్ అగర్వాల్ మెగా అభిమానులను హర్ట్ చేసిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రాగా సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు గూర్చి పరిచయం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ మొదట జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ పట్టుకున్న ఫోటో ఉన్న తారక్ చెప్పిన విషయాన్నీ షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత మరోక సిట్యువేషన్ లో తారక్, చరణ్ లతో పాటు ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందాన్ని కాజల్ ట్యాగ్ చేశారు. అయితే కాజల్ వల్ల హర్ట్ అయ్యామని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన చరణ్ విషయంలో కాజల్ బిహేవియర్ సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఆచార్య సినిమా వల్లే కాజల్ ఈ విధంగా వ్యవహరించిందని కామెంట్లు ప్రచారంలోకి వస్తున్నాయి. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ ను మొదట ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. కాజల్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం జరిగింది. అయితే వేర్వేరు కారణాల వల్ల కాజల్ అగర్వాల్ ను ఈ సినిమా నుంచి తొలగించారు. తనను తొలగించిన విషయంలో కాజల్ హర్ట్ అయ్యారని కామెంట్లు వినిపించాయి. బాక్సాఫీస్ వద్ద ఆచార్య సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. నిర్మాతలకు ఈ సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది. కొరటాల శివ సినీ కెరీర్ లో ఈ సినిమా బ్లాక్ మార్క్ గా నిలిచింది. ఈ కామెంట్లపై కాజల్ ఎలా స్పందిస్తారో చూడాలి.
కాకపోతే కాజల్ అభిమానులు వారికీ ధీటుగా సోషల్ మీడియా వేదికగా సమాధానం ఇచ్చారు. తమ హీరోయిన్ అలా కావాలని చేయలేదని అది యాదరుచికంగా జరిగిందని దాంట్లో తన తప్పేంలేదని చెప్పడంతో మెగా అభిమానులు కొంచం శాంతి చెంద్యారాని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: