బాలీవుడ్ మాస్ డైరెక్టర్ రోహిత్ శెట్టి బర్త్ డే స్పెషల్!

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా దూసుకుపోతున్నాడు. నేడు రోహిత్ శెట్టి పుట్టినరోజు.ఇతను 14 మార్చి 1974 లో జన్మించాడు.నేటితో ఇతనికి 49 ఏళ్ళు. రోహిత్ భారతీయ హిందీ చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడు, స్టంట్‌మ్యాన్, రచయిత, నిర్మాత ఇంకా టెలివిజన్ హోస్ట్ గా తనకంటూ ప్రత్యేక ముద్రని వేసుకున్నాడు. అతను హిందీ సినిమా పరిశ్రమలో అత్యంత గుర్తింపు పొందిన చిత్ర దర్శకుల్లో ఒకడు. ఇతని సినిమాలు ఎక్కువగా యాక్షన్ , కామెడీ ఇంకా మాస్ మసాలా చిత్రాల కలయికతో ఉంటాయి.ఇక జమీన్ (2003) సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రోహిత్ అజయ్ దేవగన్ అలాగే అర్షద్ వార్సీ నటించిన కామెడీ ఫిల్మ్ ఫ్రాంచైజీ గోల్‌మాల్ , గోల్‌మాల్ (2006) సినిమాతో హిట్ దర్శకుడిగా బాలీవుడ్ లో పాగా వేశాడు.ఇది సూపర్ హిట్ అయింది. ఈ ఫ్రాంచైజీలోని గోల్‌మాల్ రిటర్న్స్ (2008) ఇంకా గోల్‌మాల్ 3 (2010) లు తీసి హిట్లు కొట్టాడు.

గోల్ మాల్ 3 అయితే ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.ఆ తరువాత కామెడీ జోనర్ నుంచి బయటకి వచ్చి రోహిత్ శెట్టి తన యాక్షన్ థ్రిల్లర్  సింగం (2011) తో యాక్షన్ జానర్‌లో హిట్ కొట్టాడు. ఈ సినిమాలో అజయ్ దేవగన్  ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన వాటిలో ఒకటిగా నిలిచింది. తరువాత ముఖ్యమైన విజయాలలో బోల్ బచ్చన్ (2012), షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ (2013) ఉన్నాయి. చెన్నై ఎక్స్‌ప్రెస్ అయితే ఆ సమయంలో ఆమిర్ ఖాన్ 3 ఇడియట్స్‌ని అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది.తరువాత సింగం రిటర్న్స్ (2014), సింబా (2018), సూర్యవంశీ (2021) వంటి  విజయవంతమైన చిత్రాలతో కాప్ యూనివర్స్ ఫ్రాంచైజీలో హిట్లు కొట్టాడు. ఇలా ఎక్కువ సినిమాలు తీసి రికార్డ్ హిట్స్ కొట్టిన బాలీవుడ్ దర్శకులలో ఒకడిగా రోహిత్ శెట్టి నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: