ఆ దర్శకుడితో బాలయ్య సినిమా లేనట్టేనా..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయలము ఎదుర్కొన్న బాలకృష్ణ ... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ తో తిరిగి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా బాలయ్య ... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే ఇలా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న బాలకృష్ణ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించబోతున్నాడు అని అప్పట్లో ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రశాంత్ ... బాలకృష్ణ కు ఒక కథ చెప్పినట్టు ... బాలకృష్ణ కూడా ఆ కథకు ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ కి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడ లేదు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ ఉంటుందో లేదో చూడాలి. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ 2 టీజర్ కు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: