బన్నీ చేయాల్సిన పాన్ ఇండియా కథ.. నితిన్ చేతుల్లోకి?

praveen
సినిమా ఇండస్ట్రీని అంటేనే గాసిప్స్ ప్రపంచం అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఏదో ఒక హీరో హీరోయిన్కు సంబంధించిన గాసిప్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇలా తెరమీదకి వచ్చిన కొన్ని గాసిప్స్ తర్వాత నిజం అని తేలితే.. మరికొన్ని మాత్రం కేవలం గాసిప్స్ గానే మిగిలిపోతూ ఉంటాయి. ఏది ఏమైనా ఇలాంటి సినీ గాసిప్స్ మాత్రం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ఒక పుకారు ఇలాగే షికారు చేస్తుంది.

 మొన్నటి వరకు టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా కొనసాగిన అల్లు అర్జున్ ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బాలీవుడ్లో సైతం భారీ రేంజ్ విజయాన్ని సాధించింది అని చెప్పాలి. అయితే టాలీవుడ్ హీరోలు నటించిన కొన్ని సినిమాలు ఇక హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లో ఊహించని రీతిలో వ్యూస్ సొంతం చేసుకున్నాయ్. అయితే యూట్యూబ్లో మాత్రమే కాదు ఇక థియేటర్లో కూడా తనకు తిరుగులేదని పుష్ప సినిమాతో నిరూపించాడు అల్లు అర్జున్. ఇలా యూట్యూబ్లో సరైనోడుతో హిట్టు కొట్టి ఇక బాలీవుడ్ వెండితెరపై పుష్పతో హిట్టు కొట్టాడు బన్నీ.

 కాక ఇప్పుడు బన్నీ తరహాలోనే  ఇక యూట్యూబ్ వ్యూస్ బేస్ చేసుకుని హిందీలో సినిమాలు రిలీజ్ చేయాలనుకున్న హీరోలు ఎంతో మంది వెనకడుగు వేశారు. కానీ ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సంపాదించాలని అనుకుంటున్నా నితిన్ మాత్రం ఇక అల్లు అర్జున్ బాటలోనే నడవాలని అనుకుంటున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అల్లు అర్జున్ సినిమా కథతోనే ఆ రికార్డు కొట్టాలి అనుకుంటున్నాడు. ఇక ఇప్పుడు బన్నీ కథ నితిన్ వద్దకు చేరినట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ చక్కర్లు కొడుతుంది. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వేణు శ్రీరామ్ కాంబోలో ఐకాన్ సినిమా కోసం అల్లు అర్జున్ అనుకున్నారు. ఎన్నో రోజుల నుంచి ఇక ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు కూడా ఎదురు చూశారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయ్. అయితే ఈ సినిమా కథ ఇప్పుడు నితిన్ దగ్గరికి వెళ్ళినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో ఇక బాలీవుడ్ లో కూడా ఎంటర్ ఇవ్వాలని నితిన్ భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: