హ్యాపీ బర్త్ డే పాన్ ఇండియా సింగర్ శ్రేయా ఘోషల్!

Purushottham Vinay
పాన్ ఇండియా టాప్ ఫిమేల్ సింగర్ గా  2000 వ సంవత్సరంలో తన ఎరా స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా స్పీడ్ గా దూసుకుపోతున్న సింగర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు శ్రేయా ఘోషల్. ఈమెకు భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా లక్షలాది అభిమానులు వున్నారు. ఇండియాస్ ఆల్ టైం బెస్ట్ సింగర్స్ లో ఖచ్చితంగా శ్రేయా ఘోషల్ పేరు కూడా ఉంటుంది. ఈమె పాట పాడిందంటే ఖచ్చితంగా ఆ పాట చార్ట్ బస్టర్ అవ్వాల్సిందే. నేడు శ్రేయ ఘోషల్ పుట్టినరోజు. ఇక వెస్ట్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో మార్చి 12, 1984న జన్మించిన శ్రేయా ఘోషల్ తన మధురమైన గాత్రం ఆధారంగా అభిమానులతో పాటు ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది.దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా శ్రేయ సాధించిన విజయాలు  చాలానే ఉన్నాయి.ఆమెకు కేవలం భారతీయలే కాదు విదేశీయులు కూడా అభిమానులుగా ఉన్నారు.


ఇక ఆమె అభిమానుల జాబితాలో అమెరికా గవర్నర్ కూడా ఉన్నారు.అమెరికా దేశంలో అయితే జూన్ 26న ఏకంగా శ్రేయా ఘోషల్ డే జరుపుకుంటారని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నిజానికి, ఇది శ్రేయా ఘోషల్‌కి మాత్రమే అంకితమైన రోజు. 2010 వ సంవత్సరంలో శ్రేయ అమెరికాలోని ఓహియోకి వెళ్లింది.అక్కడ గవర్నర్ టెడ్ స్ట్రిక్లాండ్ జూన్ 26 వ తేదీని శ్రేయా ఘోషల్ డేగా జరుపుకోవాలని ప్రకటించారు.ఇక తనకు ఆరేళ్ల వయసులో సింగింగ్ పాఠాలు నేర్చుకున్న శ్రేయ.. 16 ఏళ్లకే 'స రే గ మ' అనే మ్యూజిక్ రియాలిటీ షోలో పాల్గొని విజేతగా నిలిచింది.2000 వ సంవత్సరంలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన 'దేవదాస్' సినిమాలో ఏకంగా ఐదు పాటలు పాడి ప్రజల మనసులను గెలుచుకుంది శ్రేయ ఘోషల్. 2000 లో  తన ఎరాని స్టార్ట్ చేసిన శ్రేయ ఘోషల్ అప్పటి నుంచి  వెనుదిరిగి చూసుకోలేదు.ఇప్పటికి కూడా సక్సెస్ ఫుల్ సింగర్ గా దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: