రాజమౌళి పేరు ముందు ఉండే.. ఎస్ఎస్ అర్థమేంటో తెలుసా?

praveen
దర్శకతీరుడు రాజమౌళి.. ఈపేరు గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరికీ కూడా కొత్తగా పరిచయం అక్కర్లేదు.  తన టాలెంట్ తో కళాత్మకమైన సినిమాలను తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని  ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేశాడు రాజమౌళి. ఇక ఇప్పుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రపంచంలో నలుమూలలో ఉన్న అభిమానులు సైతం ఎంతోఆతృతగా ఎదురుచూసేలా తన హవా నడిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే రాజమౌళి గురించి మీకు తెలుసా అని సినీ ప్రేక్షకులను అడిగితే.. అయ్యో ఎందుకు తెలియదు అని.. ఆయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలను.. అవి సాధించిన రికార్డులను టకా టకా చెప్పేస్తుంటారు ప్రేక్షకులు. కానీ రాజమౌళి పర్సనల్ విషయాల గురించి అడిగితే కొన్ని మాత్రమే చెప్పగలుగుతారు. ముందుగా రాజమౌళి పేరు ముందు ఎస్ ఎస్ అనే పేరు వస్తూ ఉంటుంది. అయితే దానికి అర్థం ఏంటి అన్నది మాత్రం చాలా మందికి తెలియదు.

 అయితే ఇటీవల ఒక నేటిజన్ మీ పుట్టిన ప్రదేశం గురించి ఉన్న వార్త ఎంతవరకు నిజం అంటూ ప్రశ్నించగా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అమరేశ్వర క్యాంప్.. మాన్వి తాలూకా రాయచూరు జిల్లా కర్ణాటకలో తాను జన్మించినట్లు చెప్పుకొచ్చాడు. రాజమౌళి వికీపీడియాలో కూడా ఇదే ఉంది. కొవ్వూరు నుంచి అమరేశ్వర క్యాంపులో స్థిరపడిన తెలుగు తల్లిదండ్రులకు రాజమౌళి జన్మించారు. అయితే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇంటి పేరు వి అనే అక్షరంతో వస్తుంది. కానీ రాజమౌళికి మాత్రం ఎస్ ఎస్ అని ఉంటుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. రాజమౌళి తల్లిదండ్రులు శివ భక్తులట. అందుకే శ్రీశైలంలో దర్శించిన తర్వాత రాజమౌళి జన్మించడంతో శ్రీశైల శ్రీ రాజమౌళి అనే పేరు పెట్టారట. అందుకే రాజమౌళి పేరు ముందు ఎస్ ఎస్ అని వస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ss

సంబంధిత వార్తలు: