ఆమెకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని అలాంటి పనులకి వాడుకుంటున్నా నిర్వాహకులు....!!

murali krishna
టాలీవుడ్ బుల్లితెర స్టార్ యాంకర్ ఐనా సుమ ఒకప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి ఒక్క ఛానల్లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసేవారు.ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి సుమ ప్రెసెంట్ బుల్లితెర కార్యక్రమాలను పూర్తిగా తగ్గించేశారు.
ఐతే ఏదో ఒకటో రెండో మినహా ఈమె బుల్లితెరపై ఎలాంటి కార్యక్రమాలలోనూ సందడి చేయలేదు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించకపోవడంతో ఈమె ఆదాయం కూడా భారీగానే తగ్గిందని చెప్పాలి. ఇక ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా తగ్గడంతో తన ఆదాయం కూడా భారీగా తగ్గడంతో సుమ వేరే మార్గాల ద్వారా సంపాదిస్తుంది.
ఐతే ఇప్పటికే నెట్టింట్లో రీల్స్ యూట్యూబ్ వీడియోలు చేస్తూ భారీగా అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సుమ సోషల్ మీడియా ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.ఇలా సుమా ఆదాయం తగ్గడంతో తనకు ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈమె సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇలా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా ఈమె తన వంతు సహాయం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇలా సుమా వరుసగా వెబ్ సిరీస్ యూనిట్ సభ్యులను, చిత్ర బృందాలను పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు చేస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇక సుమ చేత ఇంటర్వ్యూలు చేయిస్తే వారి సినిమాలకు వెబ్ సిరీస్ లకు భారీగా హైప్ వస్తుందన్న నేపథ్యంలో పలువురు సినీ బృందం, వెబ్ సిరీస్ నిర్వాహకులు కూడా సుమ చేత ఇంటర్వ్యూలు ప్రమోషన్లు చేయించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సుమ కూడా ఆదాయం తగ్గడంతో ఇలా వెబ్ సిరీస్ లను కూడా ప్రమోట్ చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.ఏది ఏమైనా సుమ మాత్రం బుల్లితెర కార్యక్రమాలు కాకపోతే యూట్యూబ్ వీడియోలు, అది కాకపోతే ప్రమోషన్లు అంటూ ఏమాత్రం తగ్గకుండా రచ్చ చేస్తున్నారు.
ఐతే సుమ ఆదాయం విషయంలో నమ్మే సిద్ధాంతం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క దిద్దుకోవడం అని అర్ధం అనే దాన్ని నమ్ముతుందని ఆమె ఒక ముఖాముఖీ సంభాషణలో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: