ఈ వారం "ఓటిటి" రిలీజ్ లు ఇవే..!

Pulgam Srinivas
ఈవారం "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల కాబోయే వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఏవో తెలుసుకుందాం.
రానా నాయుడు : ఈ వెబ్ సిరీస్ లో విక్టరీ వెంకటేష్ ... దగ్గుపాటి రానా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ఇద్దరికి కూడా ఇది కెరియర్ లో ఫస్ట్ వెబ్ సిరీస్ కావడం విశేషం. ఈ వెబ్ సిరీస్ తో వీరిద్దరూ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అలా కెరియర్ లో  వీరిద్దరూ నటించిన మొట్ట మొదటి వెబ్ సిరీస్ కావడంతో ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగినట్టు గానే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉండడంతో ఈ వెబ్ సిరీస్ పై  ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. ఇది ఇలా ఉంటే ఈ వెబ్ సిరీస్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ రోజు నుండి అనగా మార్చి 10 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కావడానికి రెడీ గా ఉంది. మరి ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.
రన్ బేబీ రన్ : ఈ వెబ్ సిరీస్ లో ఐశ్వర్య రాజేష్ ... ఆర్జె బాలాజీ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఈ రోజు నుండి అనగా మార్చి 10 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో అందుబాటు లోకి వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.
బ్యాడ్ ట్రిప్ : ఈ వెబ్ సిరీస్ సోనీ లీవ్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో మార్చి 10 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది.
యాంగర్ టేల్స్ : ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: