రవితేజ "రావణాసుర" టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రావణాసుర అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రవితేజ సరసన అను ఇమాన్యుయల్ ... ఫరియ అబ్దుల్లా ... దాక్షా నగర్కర్ ... పూజిత పొన్నాడ ... మేగా ఆకాష్ హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే హీరో గా ఎన్నో సినిమాలలో   నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని అలాగే అలా వైకుంఠపురం లో సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సుశాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ మూవీ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే చాలా భాగం పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదిన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేసింది. ఈ సినిమా టీజర్ లో రవితేజ తన అద్భుతమైన నటనను కనపరచాడు. అలాగే సుశాంత్ కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.

అలాగే ఈ టీజర్ కూడా అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ టీజర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో 12 మిలియన్ వ్యూస్ ను ... 169 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే రావణాసుర మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే రావణాసుర మూవీ తో రవితేజ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: